నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో మంత్రుల పర్యటన…
తెలంగాణ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఆదివారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పర్యటించనున్నారు. ఎల్‌నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ పనులు, రైతులకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమీక్షలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.























