Homeత్రిశూల్ న్యూస్ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకురావాలి

ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకురావాలి

ఇందిరమ్మ ఇళ్లకు నిధులు తగ్గించడం దారుణం..

ఆటో డ్రైవర్లనూ విస్మరించారు..

అసెంబ్లీలో పలు అంశాలను ప్రస్తావించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా…

ఇందూరు: ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని నిజామాబాద్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. గత సంవత్సరం బడ్జెట్లో 6 గ్యారంటీలకు రూ.56,083 కోట్లు కేటాయిస్తే.. ఈసారి మాత్రం 50,713 కోట్ల కే పరిమితం చేసిందన్నారు. సుమారు 5,370 కోట్లు కోత విధించిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆర్ గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని స్వయంగా రాహుల్ గాంధీ ప్రకటించారని చెప్పారు. ప్రస్తుతం కేటాయించిన నిధులు కూడా పూర్తిగా ఖర్చు చేస్తారని నమ్మకం తమకు లేదన్నారు. ఎందుకంటే గత సంవత్సరం 49,315 కోట్లు కేటాయింపులు చేసి 24 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.

అలాగే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మల్లో నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం… బడ్జెట్ లో మాత్రం నిధులను భారీగా కోత విధించిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం గత సంవత్సరం 12,571 కోట్లు కేటాయిస్తే ఈసారి మాత్రం కేవలం 5500 కోట్లు కేటాయించడం దారుణం అన్నారు. సుమారు 7 వేల కోట్లు కోత విధించిందన్నారు. మరో విచిత్రం ఏమిటంటే గత మూడు బడ్జెట్లలో కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం కేటాయించిన నిధుల్లో కేవలం 300 కోట్లు మాత్రమే తెలిపారు.  ఉచిత బస్సు పథకం ద్వారా వేలాదిగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించిందని చెప్పారు. కానీ ఈ బడ్జెట్లో ఆటో డ్రైవర్లకు మొండి చేయి చూపించిందన్నారు. ఏడాదికి రూ.12 వేల భృతి, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి విస్మరించారన్నారు. అలాగే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని అన్నారు. అలాగే ఎస్సీ సంక్షేమానికి గత సంవత్సరంలో 40 వేల కోట్లు నిధులు కేటాయించగా ఈసారి 11 వేలకు పరిమితం చేయడం దారుణం అన్నారు. ఏది ఏమైనా ప్రస్తుత బడ్జెట్ నిరాశ కలిగించిందని తక్షణమే సవరణ చేయాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బడా భీంగల్ గ్రామంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం…

0
బడా భీంగల్ గ్రామంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... లయన్స్ క్లబ్ భీంగల్–వేముగల్లు ఆధ్వర్యంలో బడా భీంగల్ గ్రామంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా...

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వాకా మహేష్…

0
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వాకా మహేష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధిగా యువ కాంగ్రెస్ నాయకుడు వాకా మహేష్ నియమితులయ్యారు. పార్టీ తరఫున ప్రభుత్వ విధానాలను...

భీంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ నియామకం…

0
భీంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ మండలం భీంగల్ పట్టణ కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ ని నియమించడం...

గంజాయి తాగుతుండగా 18 మంది పట్టుబడ్డారు…

0
గంజాయి తాగుతుండగా 18 మంది పట్టుబడ్డారు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... బుధవారం నాడు వన్నెల్ బి వరద కాలువ గట్టు పైన కొంతమంది చేరి గంజాయి తాగుతున్నారు అనే సమాచారం మేరకు బాల్కొండ...

ముచ్కూర్ సొసైటీ ద్వారా యూరియా పంపిణీ…

0
ముచ్కూర్ సొసైటీ ద్వారా యూరియా పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... ముచ్కూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా అప్లికేషన్ ద్వారా ముందుగా...

Translate »
error: Content is protected !!