Homeత్రిశూల్ న్యూస్అరైవ్… అలైవ్ ఒక ఉద్యమంగా సాగించాలి డీజీపీ బి. శివధర్ రెడ్డి,ఐపీఎస్

అరైవ్… అలైవ్ ఒక ఉద్యమంగా సాగించాలి డీజీపీ బి. శివధర్ రెడ్డి,ఐపీఎస్

అరైవ్… అలైవ్ ఒక ఉద్యమంగా సాగించాలి డీజీపీ బి. శివధర్ రెడ్డి,ఐపీఎస్

అరైవ్… అలైవ్” అవగాహన కార్యక్రమం — రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు,డిఫెన్సివ్ డ్రైవింగ్‌పై అవగాహన

బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బెల్లంపల్లి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా “అరైవ్… అలైవ్” పేరుతో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), ఐజీ, రామగుండం పోలీస్ కమిషనర్, మంచిర్యాల జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ,రోడ్డు భద్రత అనేది కేవలం పోలీస్ శాఖ బాధ్యత మాత్రమే కాకుండా ప్రభుత్వ సమగ్ర విధానంలో భాగమని తెలిపారు.“99 రోజుల యాక్సిడెంట్స్ ఫ్రీ డ్రైవ్” లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రెవెన్యూ, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్ తదితర శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ప్రతి గ్రామంలో రహదారి భద్రత కమిటీలు ఏర్పాటు చేసి,ఎక్కడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉద్యమ స్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. “మన గ్రామంలో, కాలనీలో ఒక్క ప్రాణం కూడా ప్రమాదంలో కోల్పోకూడదు” అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

అనంతరం డీజీపీ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “అరైవ్… అలైవ్” కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా కొనసాగించాలని అన్నారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఒక సామాజిక సమస్యగా మారాయని, వాటిపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రతి నెల చివరి వారంలో నిర్వహించే “అరైవ్… అలైవ్” కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రాణాల కంటే విలువైనది మరొకటి లేదని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం మాత్రమే కాకుండా సరిగా బిగించుకోవాలని, నాలుగు చక్రాల వాహనదారులు డ్రైవర్‌తో పాటు అందరూ సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు.

అదేవిధంగా, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, అధిక వేగం, అధిక లోడింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను పూర్తిగా నివారించాలని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించిన చట్టబద్ధ పత్రాలు ఎల్లప్పుడూ తమ వద్ద కలిగి ఉండాలని తెలిపారు.

ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లకు సూచిస్తూ, ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల ప్రమాదాల తీవ్రత పెరుగుతుందని, ప్రమాదం జరిగితే కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించి, అవసరమైన డ్రైవర్లకు డీజీపీ చేతుల మీదుగా కంటి అద్దాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి సబ్ డివిజన్ సీఐలు, ఎస్‌ఐలు, ఆర్ఐలు మరియు సుమారు 200 మంది పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఢీకొని వృద్ధ ప్రయాణికురాలు మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఢీకొని వృద్ధ ప్రయాణికురాలు మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ...

ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు…

0
ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు...  ఏ గణేష్ పటేల్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ పోతంగల్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బుధవారం రోజున ముస్లిం సహోదరులు...

మరుగుతున్న మహాసముద్రం…

0
మరుగుతున్న మహాసముద్రం 'ఎల్ నినో'తో పొంచి ఉన్న పెను ముప్పు ప సిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.6 డిగ్రీలుగా నమోదు 1877 రికార్డు బద్దలుకొడుతూ గరిష్ట ఉష్ణోగ్రతలు వాతావరణ సమతుల్యత భారీగా గతితప్పే...

వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్…

0
వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్.. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామంలో వీధి కుక్కల బెడద నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...

ధర్పల్లిలో పిచ్చికుక్కల బీభత్సం.. చిన్నారులు, వృద్ధులకు కాట్లు…

0
ధర్పల్లిలో పిచ్చికుక్కల బీభత్సం.. చిన్నారులు, వృద్ధులకు కాట్లు త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో పిచ్చికుక్కల బెడద రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. వీధుల్లో గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు...

Translate »
error: Content is protected !!