సెంట్రల్ బ్యాంక్‌లో పోస్టులు.. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు గడువు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో 26 స్పెషలిస్ట్ ఆఫీసర్ (ఎస్ఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్, బీఎస్సీ, ఎంబీఏ లేదా సీఏ పూర్తి చేసి, 3 నుంచి 5 ఏళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ 2026 ఏప్రిల్ 30. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ centralbank.bank.in ను సందర్శించాలి.























