ఆధార్ దుర్వినియోగాన్ని ఇలా సులభంగా తనిఖీ చేసుకోవచ్చు
మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ ఆధార్‌ను వాడుతున్నారేమోనని అనుమానం ఉందా. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అందిస్తున్న తాజా సదుపాయంతో మీ ఆధార్ అథంటికేషన్ హిస్టరీని మీరే స్వయంగా తనిఖీ చేసుకోవచ్చు. ఈ వివరాలు గత ఆరు నెలల కాలంలో మీ ఆధార్ కార్డును ఎప్పుడు, ఎక్కడ, ఏ అవసరం కోసం ఉపయోగించారో వెల్లడిస్తాయి. ఎమ్ ఆధార్ (mAadhaar) అధికారిక యాప్ ద్వారా కేవలం రెండు నిమిషాల్లో ఈ వివరాలను తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు చేయని ధృవీకరణ ఏదైనా కనిపిస్తే, వెంటనే UIDAI హెల్ప్‌లైన్ నంబర్ 1947కు ఫిర్యాదు చేయవచ్చు.























