హొనాజిపేట్ బూత్ అధ్యక్షుడి కుటుంబానికి బీజేపీ మండల శాఖ ఆర్థిక సహాయం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హొనాజిపేట్ గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ మైనార్టీ బూత్ అధ్యక్షులు మహమ్మద్ ఫయాజ్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న నేపథ్యంలో, ఆయనకు ధర్పల్లి బీజేపీ మండల శాఖ అండగా నిలిచింది.
మండల పార్టీ అధ్యక్షులు జీర్రా మహిపాల్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి రూ.20,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఫయాజ్‌కు పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీర్రా మహిపాల్, కోమటి దాసు, కర్క గంగారెడ్డి, సరి చందు, దోర్నాల రాజశేఖర్, అమ్రు నాయక్, సేవాలాల్, నరేష్, మురళి, రవీందర్, తాళ్ల రాము, రామ్ చందర్, తిరుపతి, మోహన్, గోపి, భగత్, భాస్కర్, గోపాల్, శ్రీకాంత్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

























