కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో ధర్నా…
జనగామ జిల్లా: పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో BRS పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో, కాంగ్రెస్ మోసపూరిత 1000 రోజుల పాలన పై నిరసన కార్యక్రమం చేపట్టరు…
ఈ కార్యక్రమనికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచ్చేసి మాట్లాడుతూ…తెలంగాణ లో ఒక మోసపూరిత పాలనా నడుస్తుంది బంగారు తెలంగాణ దిశగా పోతున్న తెలంగాణ ని మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం అని పాత రోజులు తీసుకువచ్చి కరెంట్ కష్టాలు, యూరియా కొరత, నీళ్ల సమస్యలతో మళ్ళీ రాష్టం వెనకబడి పోయింది.
ఎన్నికల వేల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అని 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తాం అని చెప్పి నేటికీ 1000 రోజులు అవుతున్న ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని తీవ్రంగా మండిపడ్డారు..
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పళ్ళ సుందరరామ్ రెడ్డి, ఐలేని సుధాకర్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…

























