బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారో తెలుసా?
భారతదేశంలో ఆధార్ కార్డు అత్యంత కీలకమైన గుర్తింపు పత్రం. 5 ఏళ్ల లోపు పిల్లలకు ప్రత్యేకంగా ‘బ్లూ రంగు’ బాల ఆధార్‌ను జారీ చేస్తారు. ఇందులో పిల్లల ఫోటో, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలతో పాటు తల్లిదండ్రులలో ఒకరి ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. 5, 15 ఏళ్లు నిండినప్పుడు బయోమెట్రిక్స్ తప్పక అప్‌డేట్ చేయాలి. అప్పుడు నీలి ఆధార్ తెల్ల ఆధార్‌గా మారుతుంది. బాల ఆధార్ కోసం సమీప ఆధార్ కేంద్రంలో జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రులలో ఒకరి ఆధార్ కార్డు చూపించాలి.























