గుంతలమయంగా రహదారి.. ప్రయాణికుల అవస్థలు
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నితీష్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్–భీంగల్ ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారింది. పచ్చల నడుకుడా గ్రామం వద్ద రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి, వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు గుంతలను తప్పించుకునే క్రమంలో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారిపై పరిస్థితి ఇలా ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చి, అవసరమైన మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

























