హై కోర్టు తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టు
-దానం నాగేందర్ పై అనర్హత వేటును స్వాగతిస్తున్నాం
-సీఎం రేవంత్ రెడ్డి ఫిరాయింపు రాజకీయాలకు హైకోర్టు బ్రేకులు
-బీ ఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి…
-హైదరాబాద్, సెప్టెంబర్ 18:- బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ
హై కోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టు అని బీ ఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు.
దానం నాగేందర్ పై అనర్హత వేటును స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఫిరాయింపు రాజకీయాలకు హైకోర్టు బ్రేకులు వేసిందని ఆయన గుర్తు చేస్తూ ఇకనైనా కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించకుండా స్వీయ నియంత్రణ పాటించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పడటం గొప్ప ప్రజాస్వామిక విజయంగా జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు ఇది గొడ్డలి పెట్టు అని ఆయన ఎద్దేవా చేశారు.
ఇది బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో గులాబీ ఎమ్మెల్యేలు సాధించిన ఘన విజయంగా ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై.రెండున్నరేళ్లుగా బీ ఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి లభించిన ఫలితం అని ఆయన అన్నారు. ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేమని రేవంత్ రెడ్డి కి న్యాయస్థానం తీర్పు తత్వం బోధపడి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
.దానం నాగేందర్ లాగే పార్టీ మారిన మిగతా ఎనిమిది మంది పై కూడా అనర్హత వేటు పడటం ఖాయమన్న ఆశాభావాన్ని జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు.

























