ప్లాస్టిక్ నిర్మూలనకు వినూత్న చర్య…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ధర్పల్లి సితాయిపేట్ పద్మశాలి గణేష్ మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కుల సభ్యులు సభ్యులు స్టీల్ ప్లేట్లను వినియోగించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు గ్రామ ప్రజలు సహకరించాలని
ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అన్నదానంలో స్టీల్ ప్లేట్లు ఉపయోగించడం ద్వారా ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండ్యాల వినోద్ కార్యవర్గ సభ్యులు, నరేష్, వైభవ్, అక్షయ్, క్యాదరి నారాయణ, గంగామోహన్, దాసరి గంగాధర్, జక్కుల గంగాధర్, అంకం గంగాస్వామి, నారాయణ, సబ్బని గంగాధర్, బిల్ల పురుషోత్తం, రాజేందర్, గోనె రాజేశ్వర్, చట్లస్వామి, నవీన్, మరిపెద్ది రాజు ‘రవి,రాజేందర్, తదితరులు పాల్గొన్నారు

























