నందిపేట్ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఎర్రం లింగంకు ఘన సన్మానం…
నందిపేట్: తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం కార్యదర్శిగా ఎన్నికైన నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగంను మండల తహసీల్దార్, ఎంపీడీవోతో పాటు మండల సర్పంచ్‌లు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు సర్పంచ్‌లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం కార్యదర్శిగా ఎర్రం లింగం ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఎర్రం లింగం తన కొత్త బాధ్యతల్లో మరిన్ని సేవలు అందించి సర్పంచ్‌ల సంక్షేమానికి కృషి చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు లక్ష్మీనారాయణ, దేవేందర్, సాయినాథ్, చిన్నయ్య, మహేష్, సుష్మతో పాటు పలువురు మహిళా సర్పంచ్‌లు పాల్గొని ఎర్రం లింగంకు శుభాకాంక్షలు తెలిపారు.

























