ఇంద్రానగర్ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ
అర్హులైన పేదలకు సొంతింటి కలను నెరవేర్చనున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రానగర్ తండాలో సోమవారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె నరేష్, గ్రామ సర్పంచ్ మలావత్ బాలు నాయక్, ఉపసర్పంచ్ గోవింద నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేదలకు సొంతింటి కల నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తండావాసులు, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

























