రూ.4 లక్షల ఎల్ఎల్‌సీ మంజూరు.. రూరల్ ఎమ్మెల్యేకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన శివగోని ఎల్లగౌడ్ కుడి కాలులో రక్తప్రసరణ సమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు శస్త్రచికిత్సతో పాటు మెరుగైన వైద్యం అందించేందుకు రూ.4 లక్షల ఎల్ఎల్‌సీ మంజూరైంది.
ఈ సందర్భంగా ఎల్ఎల్‌సీ మంజూరుకు సహకరించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రిక్క దినకర్ పాల్గొన్నారు.

























