నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన 2 వారాలలో డ్రంకన్ డ్రైవ్ కేసులు 471 నమోదు
జరిమానా 43,30,000/- విధించిన సంబంధిత కోర్టులు : పోలీస్ కమిషనర్ వెల్లడి.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగముగా తేది:16-3-2026 నుండి తేది: 28-3-2026 వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 471 కేసుల నమోదు చేయడం జరిగింది.
విరినందర్నీ సంబంధిత కోర్టులలో హాజరుపరచగా ఈ
🔷471 మందికి కోర్టు లో హాజరు పరచగా వీరికి రూ: 43,30,000/- జరిమానా విధించడం జరిగింది.
🔷ఇందులో 38 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్*,. తెలియజేయడం జరిగింది.
గమనిక : 1) ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదు
2) వాహనాదారులు వాహనానికిసంబంధించినటువంటి పత్రములు సక్రమముగా తమ వద్ద ఉంచుకోగలరు.

























