Homeకామారెడ్డి జిల్లాపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం...

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం…

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 4 కిలోమీటర్ల సైకిల్‌ ర్యాలీ

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి: దేశ ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్‌ చంద్ర, ఐపీఎస్‌ అన్నారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కామారెడ్డి పట్టణంలో 4 కిలోమీటర్ల సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. జీఆర్‌ కాలనీ వద్ద జిల్లా ఎస్పీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆయన స్వయంగా సైకిల్‌ తొక్కుతూ ర్యాలీలో పాల్గొని, ముగింపు వరకు కొనసాగించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల విధులు, సేవలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న వారిని అభినందించారు.

జీఆర్‌ కాలనీ నుంచి ప్రారంభమైన ర్యాలీ హౌసింగ్‌ బోర్డు కాలనీ, నిజాంసాగర్‌ చౌరస్తా, మున్సిపల్‌ కార్యాలయం, బస్టాండ్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీదుగా సాగి, కలాభారతి వద్ద ముగిసింది.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్‌) కె. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌, ఇతర పోలీసు అధికారులు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

కేత్ బచావో అభియాన్‌లో భాగంగా ఆరుతడి పంటల సాగుపై అవగాహన…

0
కేత్ బచావో అభియాన్‌లో భాగంగా ఆరుతడి పంటల సాగుపై అవగాహన ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం.. పంటల మార్పిడిపై రైతులకు వ్యవసాయ అధికారి శ్రీకాంత్ సూచనలు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్...

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఉప సర్పంచ్…

0
మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఉప సర్పంచ్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఉప సర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని...

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో 25 మంది పోలీసుల రక్తదానం…

0
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో 25 మంది పోలీసుల రక్తదానం రక్తదానం – ప్రాణదానం.. రక్తదాతలను అభినందించిన సీపీ సాయి చైతన్య... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా...

తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు…

0
తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు  అధికారులతో సమీక్షలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి  యాసంగిలో వరి సాగు వద్దని రైతులకు హితవు  మాధవనగర్ ఆర్.ఓ.బీ పనులకు రూ. 42 కోట్లు కేటాయించామని వెల్లడి... నిజామాబాద్, అక్టోబర్ 29...

స్ట్రోక్ లక్షణాలను ముందుగానే గుర్తించి.. సకాలంలో చికిత్స పొందాలి…

0
ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్ట్రోక్‌పై అవగాహన   స్ట్రోక్ లక్షణాలను ముందుగానే గుర్తించి.. సకాలంలో చికిత్స పొందాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: ప్రపంచ స్ట్రోక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ధర్పల్లి ప్రభుత్వ...

Translate »
error: Content is protected !!