అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు ఎస్సై సిహెచ్ తిరుపతి.
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్,దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసుకునే వ్యాపారులు తప్పనిసరిగా సంబంధిత డివిజినల్ స్థాయి పోలీస్ అధికారుల నుంచి అనుమతి పొందాలని ఎస్సై సీ హెచ్. తిరుపతి స్పష్టం చేశారు. దుకాణాల ఏర్పాటుకు ఆసక్తి ఉన్నవారు సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాలని సూచించారు.
అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే చర్యలు.
సంబంధిత పోలీస్ అధికారుల అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేస్తే ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్–1884, సంబంధిత నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సంబంధిత డివిజినల్
*పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు.*
దుకాణాదారులు పాటించాల్సిన నిబంధనలు.
– టపాకాయల దుకాణాలను అనుమతించిన ఖాళీ ప్రదేశాల్లోనే ఏర్పాటు చేయాలి. సంబంధిత స్థలానికి అవసరమైన నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్ఓసీ) సమర్పించాలి.
– ఒక క్లస్టర్లో 50 దుకాణాలకు మించి ఏర్పాటు చేయరాదు.
– జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేయకూడదు.
– కల్యాణ మండపాలు, సమావేశ కేంద్రాల్లో టపాకాయల దుకాణాల ఏర్పాటుకు అనుమతి లేదు.
– అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి.
– పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత ఏసీపీ కార్యాలయంలో సమర్పించాలి.
దీపావళి పండుగను ప్రజలందరూ సురక్షితంగా జరుపుకునేలా వ్యాపారులు నిబంధనలు పాటించాలని పోలీస్ శాఖ సూచించింది.

























