*ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు*
* ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గస్థాయి సమావేశం
* ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
* శాఖల వారిగా ప్రగతి నివేదికలు వివరించిన అధికారులు
* వ్యవసాయ,ఉద్యానవన పంటలు, ఇందిరమ్మ ఇళ్లు,తదితర అంశాల పై నివేదిక
* లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
* రూ. 3,78,43848 విలువ చేసే 378 మంది కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
* రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం పెద్దపీట
* పేద ప్రజలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా
* కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసే బృహత్తర కార్యక్రమం
* పంట మార్పిడితో భూసారం పెరుగుతుంది
* రైతులు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు పాటించాలి
* పంట మార్పిడి ద్వారా రైతులకు మేలు
* ప్రాణహిత చేవెళ్ల 21 ప్యాకేజీ ప్రాజెక్టు 80% పూర్తి
* తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభంతో ముందుకు
* గిరిజనుల పొడుభూముల సమస్యల పరిష్కారానికి కృషి
* బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కానీ సంక్షేమ ఫలాలు తెలంగాణలో అమలు
* కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ
* అన్ని మతాల సమ్మేళనమే కాంగ్రెస్ రాజ్యాంగమే మాకు భగవద్గీత,ఖురాన్,బైబిల్
ఇందిరమ్మ రాజ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులు కార్యాచరణలో భాగంగా శనివారం నియోజకవర్గస్థాయి సమావేశాన్ని డిచ్ పల్లి G కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మేల్యే డా.ఆర్.భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయా శాఖల వారిగా వ్యవసాయ,ఉద్యానవన పంటలు , ఇందిరమ్మ ఇళ్ల సరళి, విద్యా అభివృద్ధి, మహాలక్ష్మి పథకం,గృహజ్యోతి , శిశు సంక్షేమశాఖ, పౌరసరఫరా శాఖ, రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం , ఆరోగ్యశాఖ కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇతరత్రా అభివృద్ధి పనులను గురించి సంబంధిత అధికారులు తమ తమ ప్రగతి నివేదికను సభావేదికగా చదివి వినిపించారు.
మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో లబ్ధిపొందిన పలువురు లబ్ధిదారులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఇందులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, గృహజ్యోతి, రేషన్ కార్డు,జీరో వడ్డీ రుణాలు, ఉచిత విద్యుత్ ద్వారా లబ్దిపొందిన లబ్ధిదారులు ఉన్నారు.
*లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ*
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన రూ. 3,78,43,848 విలువ చేసే 378 మంది కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఇందులో నిజామాబాద్ రూరల్: 65, డిచ్ పల్లి : 108, ఇందల్వాయి: 32, మోపాల్: 61, జక్రాన్ పల్లి: 29, సిరికొండ: 30, ధర్పల్లి: 54, లబ్ధిదారులు ఉన్నారు.
పిపిసి గ్రామ సంఘాలకు,మహిళా సమాఖ్య మార్కెటింగ్ కమిషన్ కు రూ.2,59,98,556 విలువ చేసే చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.
ఈ మేరకు ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి … రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని కాంక్షించి ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేసేందుకు వడ్డీలేని రుణాలు అందించడం జరుగుతుందన్నారు. విద్యాభివృద్ధిలో భాగంగా రూరల్ నియోజకవర్గంలో ధర్పల్లి లో తెలంగాణ పబ్లిక్ స్కూల్, మల్కాపూర్(ఏ) లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ విశ్వవిద్యాలయం మంజూరు ఇలా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో విద్యకు ఎక్కడ కూడా కొదవలేదన్నారు. ఇటీవల విడుదల కాబడిన పదో తరగతి ఫలితాల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో 60 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం గొప్ప విషయమన్నారు.
దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. మహిళలకు తొలి ప్రాధాన్యతను ఇస్తూ..మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ..వారి సంక్షేమార్థం వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు, కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాలు అన్ని కూడా మహిళల పేరిటే ఇవ్వడం జరుగుతుందన్నారు.ఇందిరమ్మ పార్టీ. ఎన్నో త్యాగాలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం దశలవారీగా అన్ని అమలు చేస్తున్నామని.. ఇప్పుడు రెండేళ్లు పూర్తి చేసుకుంటున్నామన్న ఎమ్మెల్యే రానున్న మూడేళ్లలో మరిన్ని సంక్షేమ ఫలాలు అమలుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి..రానున్న మూడేళ్లలో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మూడేళ్ల అనంతరం కూడా రానుంది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.
అదేవిధంగా నిజామాబాద్ జిలాల్లోనే రికార్డుస్థాయిలో వడ్లు పండించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 3 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయడం జరిగిందని మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
ఇదిలా ఉంటే వ్యవసాయ అధికారుల సూచనల మేరకు రైతులు పంట మార్పిడి అనుసరించాలని దాని ద్వారా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు.పంట మార్పిడితో భూసారం పెరుగుతుందని అవగాహన కల్పించారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను దృష్టిలో పెట్టుకొని రైతులు పంటలు పండించాలని దాని ద్వారా రైతులు లాభాలు ఆర్జించవచ్చని ఆయన అన్నారు.
అదేవిధంగా రైతులకు సాగునీరు అందించేందుకు ప్రాణహిత చేవెళ్ల 21 ప్యాకేజీ ప్రాజెక్టు 80% పూర్తి కావస్తుందని త్వరలోనే సాగునీరు అందిస్తామని చెప్పారు. అటు గిరిజనులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పొడుభూముల సమస్యలను సైతం త్వరలోనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ నాయకులు పార్టీ పెద్దలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సభావేదిగా సందడిగా మారింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాని, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపెల్లి సాయిరెడ్డి, పొలసాని శ్రీనివాస్, ఉమ్మాజి నరేష్, బాగారెడ్డి, డివిజన్ నంబర్ 1 కార్పొరేటర్ అగ్గు భోజన్న,రాంచందర్ గౌడ్,ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, ఆర్మూర్ బాల్ రాజు, చిన్నారెడ్డి, మోపాల్ సాయిరెడ్డి, బకారం రవి, ఆయా మండలాల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు వాసు,శ్రీనివాస్,చందర్ నాయక్, జలందర్ రెడ్డి , మోహన్, పార్టీ నాయకులు హన్మండ్లు, ధర్మాగౌడ్, నరేందర్ రెడ్డి, సురేందర్, శ్యామ్ సన్, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

























