Homeకామారెడ్డి జిల్లాప్రజా పాలనలో మరో సంక్షేమ పథకం.. ఇందిరమ్మ కుటుంబ బీమా...

ప్రజా పాలనలో మరో సంక్షేమ పథకం.. ఇందిరమ్మ కుటుంబ బీమా…

ప్రజా పాలనలో మరో సంక్షేమ పథకం.. ఇందిరమ్మ కుటుంబ బీమా

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పించడం అభినందనీయం: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నాగరాజ్ గౌడ్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టడం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. నవంబర్ 19న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆయన ఈ పథకాన్ని స్వాగతించారు.

ఈ సందర్భంగా నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా మరో కీలకమైన సంక్షేమ పథకాన్ని తీసుకురావడం సంతోషకరమని పేర్కొన్నారు. కుటుంబంలో అనుకోని కారణాలతో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలవాలనే గొప్ప సంకల్పంతో ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు.

ఈ పథకం ద్వారా ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక భరోసా లభించడంతో పాటు, ప్రతి కుటుంబానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం కలుగుతుందని అన్నారు. ప్రజా పాలనలో సంక్షేమం, సామాజిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని నాగరాజ్ గౌడ్ తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు చేరవేస్తూ, కొత్తగా ప్రవేశపెట్టనున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను కూడా ప్రజలకు వివరిస్తామని అన్నారు.

ఈ ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రివర్గ సభ్యులు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లకు ఈ సందర్భంగా నాగరాజ్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రతి గ్రామ పంచాయతీలో 60 మంది కూలీలు తప్పనిసరి…

0
ప్రతి గ్రామ పంచాయతీలో 60 మంది కూలీలు తప్పనిసరి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల ఆదేశాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం గాంధారి :మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత...

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే చర్యలు తప్పవు…

0
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే చర్యలు తప్పవు నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై జరిమానాలు విధిస్తాం: సీఐ నరహరి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యల...

మాచారెడ్డి రైతు వేదికలో 207 మందికి పింఛన్ల పంపిణీ…

0
మాచారెడ్డి రైతు వేదికలో 207 మందికి పింఛన్ల పంపిణీ. అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: షబ్బీర్ అలీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం మాచారెడ్డి చౌరస్తా సమీపంలోని రైతు వేదికలో బుధవారం...

హొన్నాజీపేటలో 70వ ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు ప్రారంభం…

0
హొన్నాజీపేటలో 70వ ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలంలోని హొన్నాజీపేట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా 70వ ఎస్జీఎఫ్ మండల...

ధర్పల్లి గ్రంథాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు…

0
ధర్పల్లి గ్రంథాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా : ధర్పల్లి మండలం లోని గ్రంథాలయంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి...

Translate »
error: Content is protected !!