ముత్యాల సునీల్ కుమార్ కృషితో భీంగల్ కోర్టు అభివృద్ధికి రూ.18.45 లక్షలు మంజూరు
డీఎంఎఫ్ నిధులతో కోర్టు ఆవరణలో నాలుగు అభివృద్ధి పనులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ : బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కృషితో భీంగల్ మండల కేంద్రంలోని కోర్టు ఆవరణ అభివృద్ధికి జిల్లా ఖనిజ నిధి (డీఎంఎఫ్) నుంచి రూ.18.45 లక్షలు మంజూరయ్యాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ తెలిపారు.
ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి ఈ నెల 4వ తేదీన పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. మండల పరిషత్ కార్యాలయం సమర్పించిన ప్రతిపాదనల ఆధారంగా కోర్టు ఆవరణలో నాలుగు రకాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు.
ఇందులో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం, షెడ్ ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం కల్పన కోసం రూ.5 లక్షలు, మరో షెడ్ నిర్మాణానికి రూ.5 లక్షలు, గ్రావెల్ రోడ్డు, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు, ప్రీకాస్ట్ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.3.45 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.
మొత్తం రూ.18.45 లక్షలతో చేపట్టనున్న ఈ పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు పేర్కొన్నారు. పనుల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఖర్చుల వివరాలు, పనులకు సంబంధించిన ఫొటోలను డీఎంఎఫ్ వెబ్‌పోర్టల్‌లో నమోదు చేయాలని ఉత్తర్వుల్లో సూచించినట్లు వివరించారు.
భీంగల్ కోర్టు ఆవరణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించడంలో ప్రత్యేక చొరవ చూపిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లకు ఈ సందర్భంగా మల్లెల లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు.

























