Homeఇందూరుసొంత స్థలం లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి...

సొంత స్థలం లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి…

సొంత స్థలం లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి

* అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

* పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి

* చేయూత పింఛన్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…

ఇందూరు: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో సొంత స్థలం లేని నిరుపేదలకు స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన చేయూత పింఛన్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్బన్ నియోజకవర్గంలో స్థల సమస్య తీవ్రంగా ఉందని, సుమారు 38 వేల మంది నిరుపేదలకు సొంత స్థలాలు లేవని తెలిపారు. వారందరికీ స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో కొత్త పింఛన్ల కోసం 4,717 మంది దరఖాస్తు చేసుకోగా, 3,564 మందికి మాత్రమే మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన అర్హులైన వారికి కూడా పరిశీలించి పింఛన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇటీవల కేటాయించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు అవసరమైన మరమ్మతులు పూర్తిచేసి, లబ్ధిదారులకు అందించాలని కోరారు. అర్బన్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రధానంగా క్రీడా స్టేడియం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్, కళాభారతి నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణ చేపట్టాలని తెలిపారు. ఈ అంశాలను ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక నిధుల కేటాయింపు ఎంతో అవసరమని ఎమ్మెల్యే అన్నారు. అయితే గత మూడేళ్లుగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి ప్రత్యేక నిధుల రూపంలో ఒక్క రూపాయి కూడా అందలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.

అనంతరం మంత్రి దనసరి సీతక్కకు ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ వినతిపత్రం అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నల్లవెల్లిలో ఘనంగా భోగ్ భండార్ కార్యక్రమం…

0
నల్లవెల్లిలో ఘనంగా భోగ్ భండార్ కార్యక్రమం 41 రోజుల మౌన దీక్ష ముగింపు సందర్భంగా శివగంగ కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలం...

ధర్పల్లిలో దీక్షా దివాస్ స్ఫూర్తి సభ, మెగా ఉచిత వైద్య శిబిరం పోస్టర్ల ఆవిష్కరణ…

0
ధర్పల్లిలో దీక్షా దివాస్ స్ఫూర్తి సభ, మెగా ఉచిత వైద్య శిబిరం పోస్టర్ల ఆవిష్కరణ బీఆర్ఎస్ రూరల్ ఇన్‌చార్జి బాజిరెడ్డి జగన్ చేతుల మీదుగా పోస్టర్ల విడుదల... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల...

44వ జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు…

0
44వ జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు పంజాబ్‌లోని బటిండాలో నవంబర్ 24 నుంచి 28 వరకు జాతీయ స్థాయి పోటీలు – తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న తొమ్మిది మంది...

కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వక భేటీ…

0
కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వక భేటీ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం ఇందుప్రియకు ఘన సన్మానం.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర...

నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి…

0
నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి రైల్వే ట్రాక్‌ల వెంట ఫెన్సింగ్, వన్యప్రాణుల కోసం అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని అటవీ శాఖ విజ్ఞప్తి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా :...

Translate »
error: Content is protected !!