ధర్పల్లి: మోదీ బహిరంగ సభకు బయలుదేరిన బీజేపీ నాయకులు
ఆదివారం : 10/05/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న పీఎం నరేంద్ర మోదీ బహిరంగ సభకు ధర్పల్లి మండలం నుంచి భారీగా పార్టీ శ్రేణులు తరలివెళ్లాయి. మండల బీజేపీ అధ్యక్షుడు జిర్ర మైపాల్ ఆదివారం జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. సుమారు 200 మందికి పైగా యువకులు, నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా సభకు తరలివెళ్లారు. మోదీ ప్రసంగాన్ని వినేందుకు మండలం నుంచి పెద్దఎత్తున తరలి వెళ్తుండటంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు.























