తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, నిజామాబాద్ రీజియన్ పత్రికా ప్రకటన
టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలోని అన్ని డిపో బుకింగ్ కౌంటర్లలో ఇకపై క్యూ ఆర్ కోడ్ ద్వారా కూడా టికెట్లు బుకింగ్, బస్ పాస్ (PASS) QR కోర్డ్ సదుపాయం అందుబాటులో ఉందని రీజనల్ మేనేజర్ టి. జోస్నా తెలిపారు. ప్రయాణికులు మరియు విద్యార్థులు నగదు చెల్లింపులతో పాటు గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి యూపీఐ యాప్ల ద్వారా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి సులభంగా టికెట్లు పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా చిల్లర సమస్యలు తగ్గడంతో పాటు వేగవంతమైన సేవలు అందించవచ్చన్నారు.
నిజామాబాద్ రీజియన్లోని ప్రతి డిపో బుకింగ్ కౌంటర్ వద్ద క్యూ ఆర్ కోడ్ సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ మేనేజర్ కోరారు.

























