వ్యభిచార గృహాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి : పోలీస్ కమీషనర్ వెల్లడి
ఆదివారం నాడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ. పి. ఎస్., ఆదేశాల మేరకు, నగరంలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా CCS ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ సిబ్బంది విస్తృత స్థాయిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో నేడు 4టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్, తెలంగాణ పార్క్ పక్కన గల ఓ ఇంటిలో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారంతో చీతా ఫోర్స్ సిబ్బంది ఆకస్మికంగా మెరుపు దాడి నిర్వహించారు. పోలీసులు ఇంటిని పూర్తిగా తనిఖీ చేయగా అక్కడ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
దాడి సందర్భంగా అక్కడి నుండి మొత్తం 7 మొబైల్ ఫోన్లు, 3 మంది విటులు, 5 మంది విటురాళ్లు మరియు రూ.4,870 నగదు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం పట్టుబడిన వారిని స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం 4టౌన్ పోలీస్ స్టేషన్ SHO కి అప్పగించారు.
పట్టణ పరిధిలో చట్ట విరుద్ధ కార్యకలాపాలు, వ్యభిచార కేంద్రాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా, జూదం వంటి అసాంఘిక చర్యలపై నిరంతరం కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.
అలాగే యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, సమాజ శాంతి భద్రతలకు సహకరించాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు

























