Homeతెలంగాణప్రతి గ్రామానికి టీ-ఫైబర్ ఇంటర్నెట్ : అమెండేడ్ భారత్‌నెట్ కార్యక్రమం (ABP) కింద తెలంగాణలో టీ-ఫైబర్...

ప్రతి గ్రామానికి టీ-ఫైబర్ ఇంటర్నెట్ : అమెండేడ్ భారత్‌నెట్ కార్యక్రమం (ABP) కింద తెలంగాణలో టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలు

ప్రతి గ్రామానికి టీ-ఫైబర్ ఇంటర్నెట్ : అమెండేడ్ భారత్‌నెట్ కార్యక్రమం (ABP) కింద తెలంగాణలో టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలు

టీ-ఫైబర్ ప్రాజెక్ట్ పై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్ బాబు వీడియో కాన్ఫరెన్స్ 

హైదరాబాద్: అమెండేడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ABP) కింద తెలంగాణలో టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుపై కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి మంత్రి డి. శ్రీధర్ బాబుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

అమెండేడ్ భారత్‌నెట్ ప్రోగ్రాం సజావుగా అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి కొన్ని కీలక అంశాలను సింధియా దృష్టికి తీసుకువెళ్ళారు. అమలు కు సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోవడం, పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదలను వేగవంతం చేయడం పై చర్చించారు.

మండలం నుండి గ్రామ పంచాయతీ రింగ్ నెట్‌వర్క్ ఆస్తులను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానం ఏర్పాటు చేయడం పై కూడా కేంద్ర మంత్రి సింధియాతో ప్రస్తావించారు.

వీటిపై సింధియా సానుకూలంగా స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి. అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ డి. అనుదీప్, ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి బలమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే తెలంగాణ దార్శనికతపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ లక్ష్యం సాధించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

తెలంగాణ కోసం భవిష్యత్తును తీర్చిదిద్దే బలమైన నెట్‌వర్క్

కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం, కేంద్రం తో ఒప్పందం కుదుర్చుకోవడంతో, నిజమైన డిజిటల్ తెలంగాణకు పునాది పడనుంది.

రాష్ట్రంలో ఏకీకృత డిజిటల్ వెన్నెముక వైపు నిర్ణయాత్మకంగా ముందుకు సాగుతోంది. టీ-ఫైబర్ నెట్‌వర్క్ ప్రతి గ్రామ పంచాయతీని రింగ్ ఆర్కిటెక్చర్ ద్వారా అనుసంధానించనుంది.

రింగ్ ఆర్కిటెక్చర్ ద్వారా ఒక మార్గంలో అంతరాయం ఏర్పడినా, ప్రత్యామ్నాయ మార్గం ద్వారా సేవలు నిరంతరం కొనసాగుతాయి. తద్వారా గ్రామీణ తెలంగాణకు నిజమైన నిరంతర హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ అందనుంది.

మొదటి దశలో దెబ్బతిన్న నెట్‌వర్క్ ఉన్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ పునరుద్ధరణ చేపట్టనున్నారు.

అమెండేడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ కింద ఈ గ్రామాలను ఆధునిక, భవిష్యత్తు అవసరాలకు సరిపడే ఫైబర్ మౌలిక సదుపాయాలతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో సమానంగా అనుసంధానిస్తారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ

0
ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ శనివారం : 06/06/26 /త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండల కేంద్రంలో మంజూరైన నాలుగు మహిళా భవనాల నిర్మాణ పనులకు...

జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ

0
జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ నిజామాబాద్, జూన్ 5: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), నిజామాబాద్‌లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. ఆసుపత్రిలో...

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

0
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు హైదరాబాద్, జూన్05: నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు...

జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం

0
జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం... శుక్రవారం : 05/06/26 త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్ల నవీన్  జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్, రాష్ట్ర...

ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

0
ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక... శుక్రవారం  : 05/06/26 త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మహామేరు క్షత్రియ సంఘం నూతన...

Translate »
error: Content is protected !!