Homeతెలంగాణనిజామాబాద్ ప్రజలు ఈ దిగువ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించాలి : పోలీస్ కమిషనర్ వెల్లడి

నిజామాబాద్ ప్రజలు ఈ దిగువ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించాలి : పోలీస్ కమిషనర్ వెల్లడి

నిజామాబాద్ ప్రజలు ఈ దిగువ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించాలి : పోలీస్ కమిషనర్ వెల్లడి

1) విగ్రహాల ప్రతిష్టాపన:- ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్టించరాదు, ముఖ్యంగా జనరద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేపట్టరాదు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆద్వర్యంలోని కమిటీ యొక్క అనుమతులు తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది.

2) శబ్ద కాలుష్యం నియంత్రణ:- ఎక్కువశబ్దంతో డి.జే లను ఏర్పాటుచేయరాదని , ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. రెసిడెన్షియల్ స్థలంలో, కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబెల్స్ సౌండ్ వాడాలని రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డి.జే ల సౌండ్ సిస్టం పూర్తిగా నిషేదం గలదు. పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి.

3) ఊరేగింపులు, సభల నిర్వహణ:- ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన ధ్వని శబ్దం ఉత్పత్తి చేసే డి. జేలు. సౌండ్ సిస్టంలు నిజామాబాద్ కమిషనరేటు పరిధిలో నిషేదం గలదు. ఎవరైనా సభలు, సమావేశాలు జన సంచార ప్రదేశాల్లో లౌడ్ స్వీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. 500 మందితో కూడిన సమావేశాలు లేదా సభలు నిర్వహించాలని భావిస్తే సంబంధిత అసిస్టెంటు పోలీస్ కమిషనర్ అనుమతి తప్పనిసరి 500 మంది కంటే ఎక్కువ జనాలతో కూడిన కార్యక్రమనికి 72 గంటల ముందుగా పోలీస్ కమిషనర్ అనుమతి తీసుకోవాలి.

4) సార్వజనిక ప్రదేశాల్లో నియమాలు:- మాల్స్, సినిమా ధియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటి నిబంధనలు తప్పనిసరి పాటించాలి. ప్రతీ ఒక్కరు క్యూ పద్దతిని తప్పనిసరి పాటించాలి.

5) డ్రోన్ల వినియోగం పై ఆంక్షలు:- డ్రోన్ల వాడకం వలన ఎక్కువ ప్రమాదాలు పొంచి ఉన్న నేపద్యంలో నియంత్రణ చర్యలు తీసుకోవడం జరగుతుందని, ఈ డ్రోన్ల ఉపయోగం వలన జనజీవనానికి విఘాతం కలగడమే కాకుండా శాంతి భద్రతలకి విఘాతం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ,ఎవరయినా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రారంభించదలచినచో ముందస్తుగా సంబంధిత ప్రభుత్వ సంస్థలు, పోలీసు మరియు ఏవియేషన్ అధికారుల నుండి క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.

6) నకిలీ గల్ఫ్ ఏజెంట్ల నుండిఅప్రమత్తం:- జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పాస్ పోర్టు, వీసా, రవాణా, టూరిస్ట్ తదితర సేవలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి చాలా మంది గల్ఫ్ ఏజెంట్లు అనదికారికంగా వ్యాపారాలు నిర్వహిస్తూ,అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. కావున జిల్లా ప్రజలు గల్ఫ్ ఏజెంట్లకు తమ ఇల్లు అద్దెకు ఇచ్చే ముందుజాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. అటువంటి వారు అద్దెకు వస్తే ముందస్తుగా వారి సమాచారాని సంబంధిత పోలీసు స్టేషన్ వారికి తెలియజేయండి. ఎవరైనా అనుమానస్పదంగా కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.

7) ” ఎ ” సర్టిఫికెట్ ఉన్న సినిమాల వీక్షణం:- నిజామాబాద్ జిల్లాలో ” ఎ ” (పెద్దలు) సర్టిఫికేట్ పొందిన సినిమాలను మైనర్లు చూడటానికి ధియేటర్లను అనుమతించరాదు.

8)బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం:- బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తులు నిజామాబాద్ వీదుల్లో చట్టాన్ని గౌరవించే పౌరుల పట్ల ముఖ్యంగా మహిళలు మరియు పిల్లల పట్ల అసభ్యకరమైన వికృత మరియు అసభ్యకరమైన ప్రవర్తన ను ప్రదర్శిస్తున్నట్లు నివేధికలు సూచిస్తున్నాయి. సాధారణంగా రోడ్డు వినియోగదారులకు మరియు ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలకు చికాకు మరియు ఆటంకము కలిగించి ప్రజా ప్రశాంతతకు దారితీస్తుంది. కావున బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీచేయడం జరిగింది.

ముఖ్యగమనిక :- పైన తెలియజేసిన నిబంధనలను ఎవ్వరయినఅతిక్రమించినయెడల వారిపై సంబంధిత చట్టాల ప్రకారం తగు చర్యలు తీసుకోవడానికి నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లోని పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ లకు / ఎస్.ఐ లకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్, అధికార ఉత్తర్వులను జారీచేయడం జరిగింది. ఇట్టి ఉత్తర్వులు తేది:1-06-2026 నుండి తేది:15-06-2026 వరకు అమలులో ఉంటుంది. కావున ప్రజలందరూ సంబంధిత పోలీస్ అధికారులకు సహకరించగలరు.
మంచి ఫ్రేమ్ తయారుచేసి పంపగలరు నిజామాబాద్ జిల్లా మ్యాప్ కూడా అందులో పెట్టగలరు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్…

0
ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు ట్రాన్స్‌ఫార్మర్ చోరీలకు పాల్పడిన ఆరుగురు నిందితులు అరెస్ట్.. కాపర్ కాయిల్స్, వాహనాలు, చోరీకి ఉపయోగించిన...

భీంగల్ టౌన్ కాంగ్రెస్ కార్యవర్గం ఏర్పాటు…

0
భీంగల్ టౌన్ కాంగ్రెస్ కార్యవర్గం ఏర్పాటు... భీంగల్‌లో కాంగ్రెస్ నూతన కార్యవర్గం నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణ కాంగ్రెస్ కమిటీకి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కాంగ్రెస్...

బడా భీంగల్ గ్రామంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం…

0
బడా భీంగల్ గ్రామంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... లయన్స్ క్లబ్ భీంగల్–వేముగల్లు ఆధ్వర్యంలో బడా భీంగల్ గ్రామంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా...

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వాకా మహేష్…

0
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వాకా మహేష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధిగా యువ కాంగ్రెస్ నాయకుడు వాకా మహేష్ నియమితులయ్యారు. పార్టీ తరఫున ప్రభుత్వ విధానాలను...

భీంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ నియామకం…

0
భీంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ మండలం భీంగల్ పట్టణ కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ ని నియమించడం...

Translate »
error: Content is protected !!