Homeజాతీయఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీ.. కేంద్రమంత్రులు గడ్కరీ, రామ్మోహన్‌తో కీలక భేటీలు...

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీ.. కేంద్రమంత్రులు గడ్కరీ, రామ్మోహన్‌తో కీలక భేటీలు…

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీ.. కేంద్రమంత్రులు గడ్కరీ, రామ్మోహన్‌తో కీలక భేటీలు…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై చర్చించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్, ఎంపీ రఘువీర్ రెడ్డి, రాష్ట్ర అధికారులు సమావేశమై రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు తెలంగాణలోని పలు జాతీయ రహదారుల నిర్మాణాల గురించి మాట్లాడారు.

రీజినల్ రింగ్ రోడ్డుపై చర్చ..

ఈ సమావేశంలో రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి 95 శాతం భూసేకరణ పూర్తయిందని సీఎం వివరించారు. ఉత్తర భాగం పనులు ప్రారంభించేందుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని నితిన్ గడ్కరీని కోరారు. అలాగే రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైన కేంద్ర అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హైదరాబాద్ – అమరావతి మధ్య 12వ వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టాలని కూడా సీఎం రేవంత్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా, పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు.

కేంద్రమంత్రి రామ్మోహన్‌తో సీఎం రేవంత్‌ సమావేశం..

మరోవైపు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కూడా సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ రఘువీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలోని అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న విమానాశ్రయాల అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. ప్రత్యేకంగా అదిలాబాద్ విమానాశ్రయం, వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన డిజైన్, మౌలిక వసతుల కల్పన, నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. ఈ ప్రాజెక్టులను వేగవంతం చేసి తెలంగాణలో ప్రాంతీయ విమాన సేవలను విస్తరించాలని సీఎం కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో రహదారులు, విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్ర సహకారం అందించే అంశంపై ఈ భేటీలు కీలకంగా మారాయి.. KP

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ టౌన్ కాంగ్రెస్ కార్యవర్గం ఏర్పాటు…

0
భీంగల్ టౌన్ కాంగ్రెస్ కార్యవర్గం ఏర్పాటు... భీంగల్‌లో కాంగ్రెస్ నూతన కార్యవర్గం నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణ కాంగ్రెస్ కమిటీకి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కాంగ్రెస్...

బడా భీంగల్ గ్రామంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం…

0
బడా భీంగల్ గ్రామంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... లయన్స్ క్లబ్ భీంగల్–వేముగల్లు ఆధ్వర్యంలో బడా భీంగల్ గ్రామంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా...

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వాకా మహేష్…

0
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వాకా మహేష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధిగా యువ కాంగ్రెస్ నాయకుడు వాకా మహేష్ నియమితులయ్యారు. పార్టీ తరఫున ప్రభుత్వ విధానాలను...

భీంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ నియామకం…

0
భీంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ మండలం భీంగల్ పట్టణ కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ ని నియమించడం...

గంజాయి తాగుతుండగా 18 మంది పట్టుబడ్డారు…

0
గంజాయి తాగుతుండగా 18 మంది పట్టుబడ్డారు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... బుధవారం నాడు వన్నెల్ బి వరద కాలువ గట్టు పైన కొంతమంది చేరి గంజాయి తాగుతున్నారు అనే సమాచారం మేరకు బాల్కొండ...

Translate »
error: Content is protected !!