నేడు అమెజాన్ డేటా సెంటర్‌కు సీఎం రేవంత్ శంకుస్థాపన…
తెలంగాణ : భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ కొత్త డేటా సెంటర్ ఏర్పాటుకు బుధవారం సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. రంగారెడ్డి(D) కందుకూరు(M) మీర్‌ఖాన్‌పేట వద్ద భూమిపూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అమెజాన్ డేటా సెంటర్ విస్తరణకు ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. రూ.125 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రభుత్వం అమెజాన్‌కు అందించింది. 12 ఏళ్ల వ్యవధిలో విస్తరణకు రూ.60వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకున్నారు.























