Homeడిచ్ పల్లి మండల్పేదల పార్టీ కాంగ్రెస్ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

పేదల పార్టీ కాంగ్రెస్ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

పేదల పార్టీ కాంగ్రెస్ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

* గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పెద్దపీట

* మహిళా స్వావలంబన దిశగా కృషి

* ప్రతి పేద వాడి కళ్ళల్లో ఆనందం కోసం కాంగ్రెస్ కృషి

* మహిళలను కోటీశ్వరులు చేయడానికి.. వడ్డీలేని రుణాలు

* మెంట్రాజ్ పల్లి గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే

* మురిసిపోయిన లబ్ధిదారులు

* బీజేపీ,బీఆర్ఎస్ తీరుపై ధ్వజం

* తెలంగాణను బీఆర్ఎస్ అప్పులపాలు చేసిందని ధ్వజం

పేదల సంక్షేమానికి కట్టుబడి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం *ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి* అన్నారు. గురువారం డిచ్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్ ప్రవళిక-వినోద్ అధ్యక్షతన జరిగిన గ్రామసభ తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో ప్రారంభించారు.
అనంతరం శాఖల వారిగా సంబంధిత అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును గురించి వివరించారు. గ్రామంలో 30 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 26 నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. అటు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే వద్దకు వచ్చి ఆనందం వ్యక్తంచేశారు. 75 మహిళా సంఘాలు ఉండగా దాదాపు 4కోట్లకు పైగా రుణాలు అందించినట్లు వివరించారు. అనంతరం గ్రామ సర్పంచ్ నేతృత్వంలో ఎమ్మెల్యేను సన్మానించారు.

ఈ మేరకు ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ… ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద వాడి కళ్లలో ఆనందం వెల్లివిరుస్తుందని చెప్పారు. గ్రామంలో 30 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 26 నిర్మాణం పూర్తి చేసుకున్నాయని.. రెండవ విడతలో మరిన్ని ఇండ్లు మంజూరు చేసి.. అర్హులైన ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరేలా చూస్తామన్నారు.ఐకేపీ రుణాల ద్వారా 18మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రుణాలు అందించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా రాష్ట్రంలో 1 కోటి 15లక్షల కుటుంబాలకు రూ. లక్షల చొప్పున బీమా సౌకర్యం కల్పిస్తుందన్నారు. అదేవిధంగా విద్యా,వైద్యం వంటి రంగాలకు పెద్దపీట వేస్తుందని.. అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి నిధులు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. పక్కనే ఉన్న తెలంగాణ యూనివర్సిటీలో రూ.90 కోట్లకు పైగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. బాలబాలికలకు హాస్టళ్లు, నూతనమైన ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అటు బీజేపీ,బిఆర్ఎస్ నాయకుల తీరును ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక అనవసరపు రాద్ధాంతాలు చేస్తున్నారని మండిపడ్డారు.
స్థానిక గ్రామ సర్పంచ్ పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మెంట్రాజ్ పల్లి చైతన్యవంతమైన గ్రామమని గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్,ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు వాసు బాబు,కాంగ్రెస్ పార్టీ నాయకులు రాంచందర్ గౌడ్, అంబర్ సింగ్, ధర్మగౌడ్, ఆత్మ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సాయిలు,ఆనంద్,స్థానిక ఉప సర్పంచ్ సురేష్,స్థానిక అధికారులు,ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిలిచిపోయిన అనుమతులను అన్‌లాక్ చేయడానికి 12-18 నెలల్లో నిర్మాణ ప్రణాళికను తీసుకురావాలని PMRDA తెలిపింది

0
ఆమోదించబడిన ఐదు పట్టణ ప్రణాళిక పథకాలను PMCకి బదిలీ చేయడం జరుగుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మాధురీ మిసాల్ తెలిపారు పూణే: అథారిటీ డ్రాఫ్ట్ డెవలప్‌మెంట్ ప్లాన్ (డిపి) రద్దు తర్వాత...

‘ఆధునిక గురుకుల్’, ఎస్కేప్ టన్నెల్, CCTV నిఘా: పూణే ‘గాడ్‌మాన్’ 15 ఏళ్లపాటు మహిళపై నియంత్రణ వలయాన్ని ఎలా...

0
నిందితుడిని రాధామోహన్ మిశ్రాగా గుర్తించారు. పుణె: దైవిక శక్తులు ఉన్నాయని చెబుతూ కొన్నాళ్లుగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు, శారీరకంగా హింసించి, ఆర్థికంగా దోపిడీకి పాల్పడినందుకు గాను స్వయంకృతాపరాధిగా చెప్పుకునే దేవుణ్ణి,...

పేదవానికి చదివే వజ్రాయుధం… ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

0
పేదవానికి చదివే వజ్రాయుధం... ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. గురువారం : 18/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్ జూన్ 18 త్రిశూల్ న్యూస్... గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

Translate »
error: Content is protected !!