Homeత్రిశూల్ న్యూస్ఆంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

ఆంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

ఆంజనేయ స్వామి ఆలయ పున ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

ప్రత్యేక పూజల నడుమ ఆలయ ప్రారంభోత్సవం 

చిరకాల స్వప్నం నెరవేరిన వేళ గ్రామస్థుల హర్షం 

ఆలయ పునర్నిర్మాణంలో ఎమ్మెల్యే కృషిని కొనియాడిన గ్రామస్థులు 

హనుమాన్ జయంతి వేల..ఘనంగా ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం 

7 ఏళ్ళ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణ చిరకాల స్వప్నం ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి చొరవతో సాకారం కావడంతో రామడుగు గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు. ధర్పల్లి మండలం రామడుగు గ్రామంలో దేవాదాయ శాఖ ద్వారా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయాన్ని *నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి* గురువారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వచనాలు స్వీకరించారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేను గ్రామస్థులు,పండితులు పూర్ణకుంభంతో సాదరంగా స్వాగతం పలికారు. అంతకు ముందు గ్రామంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.మొఘలుల నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ఉద్యమించిన గొప్ప మహనీయులు పాపన్న గౌడ్ అని కొనియాడారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో *ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి* మాట్లాడారు… గ్రామస్థులు ఐక్యంగా పట్టుబట్టి ఆలయ నిర్మాణానికి చూపిన సహకారం అభినందనీయమన్నారు. అడుగడుగున అడ్డంకులు ఏర్పడిన వాటిని అధిగమించి ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగిందన్నారు.హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.ఆ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సీలు గ్రామస్తుల పై, నియోజకవర్గ ప్రజల పై ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం గ్రామస్థులు పలు సమస్యలను వివరించగా.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.రామడుగు గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. అటు గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూర్ బాల్ రాజు,పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్,సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్,స్థానిక సర్పంచ్ రమేష్ గౌడ్,గ్రామాభివృద్ధికి కమిటీ అధ్యక్షులు జి.రాజారెడ్డి,కే.రాజారెడ్డి,డి.గంగారెడ్డి,శ్రీనివాస్,పోషన్న,ఆనంద్,కాంగ్రెస్ పార్టీ నాయకులు మునిపల్లి పెద్ద సాయి రెడ్డి,పొలసాని శ్రీనివాస్,ధర్మాగౌడ్,రాంచందర్ గౌడ్,నరేందర్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వావిలాల పాఠశాలలో వనమహోత్సవం…

0
వావిలాల పాఠశాలలో వనమహోత్సవం... జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుని ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ప్రధాన...

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

Translate »
error: Content is protected !!