భీంగల్ మండల సమస్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు వినతిపత్రం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో భీంగల్ మండల సర్పంచులు, కౌన్సిలర్లు కలిసి మండలంలోని పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా భీంగల్ మండలంలో పెండింగ్‌లో ఉన్న ఎమ్మార్వో కార్యాలయం నిర్మాణం, రహదారుల దుస్థితి, మినీ స్టేడియం నిర్మాణం, వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి పనుల పురోగతి తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
వినతిని స్వీకరించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమస్యలపై సానుకూలంగా స్పందించారు. భీంగల్‌లో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు. ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరగా మంజూరు చేసి, పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా భీంగల్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల రహదారుల దుస్థితిపై ఆర్ అండ్ బీ అధికారులతో మాట్లాడి, గుంతలను వెంటనే పూడ్చి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రధాన రహదారులను తనిఖీ చేసి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ భీంగల్ మండల అధ్యక్షుడు మల్లె లక్ష్మణ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అరిగెల జనార్ధన్, ఉపాధ్యక్షుడు భూక్య రమేష్, దేవేందర్, వసంత్, వసుంధర్, సర్దార్ అజయ్, అశోక్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, భీంగల్ మండల కౌన్సిలర్లు అంజుమ్, సతీష్, సందీప్, సంగ్యా నాయక్ తో పాటు నాయకులు వాక మహేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.























