ER ఫౌండేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం …
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ గౌడ్
నీట్ పేపర్ లీకేజీ కావడం అత్యంత బాధాకరమని ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ అన్నారు. శుక్రవారం ఆయన ఆర్మూర్ పట్టణంలోని ER ఫౌండేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. డీల్లీలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం సమంజసం కాదన్నారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తు పరీక్ష విధానంపై సామాజిక బాధ్యత కలిగిన సోషల్ ఆర్గనైజేషన్ సంస్థలు ప్రశ్నించాల్సిన అవసరం వచ్చిందన్నారు. నీట్ 2026 పరీక్ష ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందన్నారు. కష్టపడి చదివి పరీక్ష రాసిన విద్యార్థులకు పరీక్ష లీకేజీతో వారిలో మానసిక వేదన, మానసిక ఆందోళన వారిపై ప్రభావాన్ని చూపుతుందన్నారు. వాస్తవంగా ఇటువంటి రాజకీయ వ్యవస్థలో చదువుకున్న వ్యక్తి, నైతిక విలువలు ఉన్న వ్యక్తి రావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంబేద్కర్ గొప్ప విద్యావంతుడు కావడం వల్ల మనకు రాజ్యాంగం వచ్చిందన్నారు. ఆయనంటే తనకు ఎంతో గౌరవం అన్నారు. ఆయనను ఫాలో అవుతున్నానని స్పష్టం చేశారు. విద్యావంతులు ఉంటేనే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృది కావడానికి అవకాశం ఉందన్నారు. కర్రలు పట్టుకునే నాయకులు మనకు వద్దని, దౌర్జన్యాలు, రెచ్చగొట్టే నాయకులను నమ్మవద్దని కోరారు. కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్ష లీకేజీలను అరికట్టాలని, విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యా వ్యవస్థపై సమాజంపై, సొసైటీపై నమ్మకం కలిగేలా ప్రతి ఒక్కరు ప్రవర్తించాలని, ఆ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో విద్యార్థులపై కర్కశంగా లాఠీచార్జీ చేయడాన్ని ER ఫౌండేషన్ ఖండిస్తుందన్నారు. అనవసరంగా రాజకీయ శక్తులు మనల్ని రెచ్చగొడితే.. రెచ్చిపోయి అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవదని హితవు పలికారు. ER ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, రామ్ చందర్, నూకల శేఖర్, బ్యాంకు నవీన్, వినోద్, దినేష్, ముఖేష్, కెవి రమణ, కరాటే భోజన్న, ఓమ్ ట్రేడర్స్ గంగా మోహన్, కర్తన్ నవీన్, తుకారామ్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

























