డిచ్‌పల్లి మానవతా సదన్‌లో ఘనంగా కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
డిచ్‌పల్లి: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 50వ జన్మదిన వేడుకలను శుక్రవారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని మానవతా సదన్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మానవతా సదన్‌లోని విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, యువ నాయకుడు బాజిరెడ్డి జగన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ, కేటీఆర్ తన జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారని తెలిపారు. ప్రజా సేవే లక్ష్యంగా కేటీఆర్ నిరంతరం ముందుకు సాగుతున్నారని, తెలంగాణ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో ప్రజాసేవను మరింత కాలం కొనసాగించాలని ఆకాంక్షించారు.
మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మాట్లాడుతూ, మానవతా సదన్‌లో చదువుతున్న విద్యార్థులు కేటీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేసే స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థులే భావి భారత పౌరులని, అన్ని రంగాల్లో ప్రతిభ కనబర్చి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మానవతా సదన్ విద్యార్థులు కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ కార్యకర్తలు, డిచ్‌పల్లి మండల సీనియర్ నాయకులు శక్కరికొండ కృష్ణ, నీరడి పద్మారావు, నల్లవెల్లి సాయిలు, గోపు నడపన్న, లింగం యాదవ్, అంజయ్య, పుప్పలపల్లి సర్పంచ్ చింత ప్రియాంక మహేష్, సర్పంచ్‌లు ఓడ్డం నరసయ్య, యూసుఫ్, గంగారం, యెన్నోళ్ల రాజు, కురికెల్లి సురేష్, సంజయ్, రాజారెడ్డి, జునైద్, గోపు చరణ్, నవీన్, దేవన్న, బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు గీత, బుచ్చమ్మ, యశోదతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

























