షాద్‌నగర్‌లో బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం ప్రారంభం…
ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు
ఫీజుల బకాయి బిజెపి లాడాయి పోస్టర్ విడుదల
షాద్‌నగర్ పట్టణంలోని ఏపీ కాంప్లెక్స్‌లో భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పతంగి రాజగోపాల్ గౌడ్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కార్యవర్గ సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బీజేపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సమావేశానికి హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, శ్రీశైలం, కొప్పు బాషా, కేస్ రత్నం, శ్రీరాములు, శ్రీనివాస్ రెడ్డి, మహేందర్‌తో పాటు స్థానిక బీజేపీ నాయకులు శ్రీ వర్ధన్ రెడ్డి, అందే బాబయ్య తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ బలోపేతం, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, జిల్లాలో పార్టీ కార్యకలాపాలపై నాయకులు చర్చించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఫీజుల బకాయి బిజెపి లాడాయి పోస్టర్ విడుదల చేశారు..























