ప్రారంభానికి సిద్ధమైన భీమ్‌గల్ కోర్టు…
భీమ్‌గల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదివారం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ కోర్టు అందుబాటులోకి రావడం వల్ల భీమ్‌గల్, సిరికొండ, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, ఏర్గట్ల మండలాల ప్రజలకు కేసుల విచారణ వేగవంతమై, సత్వర న్యాయం అందుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై దూరప్రాంతాలకు వెళ్లే తిప్పలు తప్పుతాయన్నారు.























