Homeఅంతర్జాతీయశంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాల రద్దు.. గల్ఫ్ ప్రయాణికుల అవస్థలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాల రద్దు.. గల్ఫ్ ప్రయాణికుల అవస్థలు

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా విమాన మార్గాలను మార్చడం లేదా రద్దు చేస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రధానంగా గల్ఫ్, అరబ్ దేశాలకు వెళ్లే సర్వీసులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. శంషాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లాల్సిన 23 విమాన సర్వీసులు రద్దయ్యాయి. అదేవిధంగా వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన 21 విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. దుబాయ్, దోహా (ఖతార్), కువైట్, దమ్మమ్, సౌదీ అరేబియా, షార్జా, అబుదాబి, జెడ్డా, మస్కట్ దేశాలకు వెళ్లాల్సిన 23 విమాన సర్వీసులు రద్దయ్యాయి.ప్రయాణికుల ఆందోళన..ముందస్తు సమాచారం లేకుండా విమానాలు రద్దు కావడంతో ఎయిర్ పోర్టులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర దేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తమ కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్ అవుతున్నామని ఆందోళన చెందుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. కొన్ని సంస్థలు టికెట్ రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ తేదీలను కేటాయిస్తున్నప్పటికీ, యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సర్వీసులు ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.యుద్ధం కారణంగా విమాన మార్గాల్లో మార్పులు ఇరాన్, ఇజ్రాయెల్ వైమానిక క్షేత్రాలను మూసివేయడం లేదా ప్రమాదకరంగా ప్రకటించడం వల్ల విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల విమాన ప్రయాణ కాలం 2 నుంచి 3 గంటలు పెరుగుతోంది. సుదీర్ఘ మార్గాల వల్ల ఇంధన ఖర్చు పెరిగి, విమాన టికెట్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. గల్ఫ్ దేశాలకు ప్రయాణించాలనుకునే వారు తమ విమాన సంస్థల నుంచి అధికారిక సమాచారం అందిన తర్వాతే ఎయిర్ పోర్టుకు బయలుదేరడం శ్రేయస్కరమని పలువురు చెబుతున్నారు.. KP

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిలిచిపోయిన అనుమతులను అన్‌లాక్ చేయడానికి 12-18 నెలల్లో నిర్మాణ ప్రణాళికను తీసుకురావాలని PMRDA తెలిపింది

0
ఆమోదించబడిన ఐదు పట్టణ ప్రణాళిక పథకాలను PMCకి బదిలీ చేయడం జరుగుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మాధురీ మిసాల్ తెలిపారు పూణే: అథారిటీ డ్రాఫ్ట్ డెవలప్‌మెంట్ ప్లాన్ (డిపి) రద్దు తర్వాత...

‘ఆధునిక గురుకుల్’, ఎస్కేప్ టన్నెల్, CCTV నిఘా: పూణే ‘గాడ్‌మాన్’ 15 ఏళ్లపాటు మహిళపై నియంత్రణ వలయాన్ని ఎలా...

0
నిందితుడిని రాధామోహన్ మిశ్రాగా గుర్తించారు. పుణె: దైవిక శక్తులు ఉన్నాయని చెబుతూ కొన్నాళ్లుగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు, శారీరకంగా హింసించి, ఆర్థికంగా దోపిడీకి పాల్పడినందుకు గాను స్వయంకృతాపరాధిగా చెప్పుకునే దేవుణ్ణి,...

పేదవానికి చదివే వజ్రాయుధం… ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

0
పేదవానికి చదివే వజ్రాయుధం... ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. గురువారం : 18/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్ జూన్ 18 త్రిశూల్ న్యూస్... గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

Translate »
error: Content is protected !!