నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా పోలీస్ నీవేదికల ప్రకారం కొంత మంది హోలీ పండుగ సందర్భముగా వివిధ రకాల రహదారులలో మరియు బహిరంగ ప్రదేశాలలో వారికి ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు మరియు వాహనాలపై రంగులు లేదా రంగు నీటిని చల్లడం లేదా ఇష్టపడని వ్యక్తులపై రంగు పూయడం వల్ల చికాకు కలిగిస్తున్నట్లు పోలీసు వారికి నివేదికలు అందాయి. కావున 1. వీధుల్లో మరియు బహిరంగ ప్రదేశాలలో గుంపుగా ద్విచక్ర వాహనాలు మరియు ఇతర వాహనాల కదలికలను నిషేధం గలదు. ఇవి శాంతిభద్రతలకు విఘాతం లేదా ప్రజలకు అసౌకర్యం కలిగిస్తాయి.2. నిజామాబాద్ నగరంలో రహదారులు మరియు బహిరంగ ప్రదేశాలలో ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు మరియు వాహనాలపై రంగులు లేదా రంగు నీటిని చల్లడం లేదా ఇష్టపడని వ్యక్తులపై రంగు పూయడం నిషేధం గలదు.కాబట్టి, పైన పేర్కొన్న వాటిని పరిగణనలోకి తీసుకుని, నిజామాబాద్ (మెట్రోపాలిటన్ ఏరియా) పోలీస్ చట్టంలోని సెక్షన్ 22(1) లోని క్లాజ్ (డి) కింద * నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్.,* పైన పేర్కొన్న ఆదేశాన్ని ఉల్లంఘించిన ఏ వ్యక్తి అయినా “నిజామాబాద్ (మెట్రోపాలిటన్ ఏరియా) పోలీస్ చట్టం” లోని సెక్షన్ 76 ప్రకారం చట్ట ప్రకారం ఎవరైనా ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది.ఇట్టి ఉత్తర్వులు తేది : 02.03.2026 సాయంత్రం 06:00 గంటల నుండి 05.03.2026 ఉదయం 06:00 గంటల వరకు అమలులో ఉంటుంది.ఈ ఉత్తర్వును ఉల్లంఘించే ఏ వ్యక్తి అయినా సెక్షన్ 223 BNS మరియు ఇతర చట్టాలు మరియు వర్తించే చట్టపరమైన నిబంధనల ప్రకారం శిక్షకు గురవుతారు. ఇట్టి ఉత్తర్వులను నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్స్ చర్యలు తీసుకోవడానికి సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.























