నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్., రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కందకుర్తి పుష్కర ఘాట్లను పర్యవేక్షించడం జరిగింది.
ఇందులో భాగంగా 2027 సంవత్సర కాలంలో రాబోయే గోదారి పుష్కరాలతో ఉద్దేశించి పుష్కర ఘాట్ల ఏర్పాట్లు , మహిళలు దుస్తులు మార్చుకునే గదులు , పుష్కర ఘాటుకు వచ్చే రోడ్డు మరియు వెళ్లే దారులను , పార్కింగ్ ప్రదేశాల మరియు నీళ్లలో ఎవరు కూడా మునిగి ప్రాణా నష్టం జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటులను చేయాలని అధికారులకు సూచించారు గ్రామస్తులతో మాట్లాడి గత పుష్కరాల్లో ఏమేం లోటుపాట్లు ఉన్నాయి అడిగి తెలుసుకున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి పార్కింగ్ సమస్యలు మరియు ఇతర అవరోధాలు కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పినారు. ఈ సందర్బంగా బోధన్ ఎ.సి.పి శ్రీనివాస్ , బోధన్ రూరల్ సర్కిల్ సిఐ విజయ్ బాబు, రెంజల్ ఎస్. ఐ. కే. చంద్రమోహన్ మరియు కందకుర్తి సర్పంచ్ ఉపసర్పంచ్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.























