నందిపేట్లో బ్రీజా కారు బీభత్సం…. నలుగురికి గాయాలు….
నందిపేట్ విజయనగరం రామాలయం ముంగట ప్రమాదం……
అనంతరం కారు అతివేగంగా వచ్చి సబ్ స్టేషన్ కెనాల్ వద్ద తగలబడి బూడిదైన కారు….
మండల కేంద్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ అక్తర్ హుస్సేన్ కు విరిగిన కాలు….
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
నందిపేట్ ఆగస్టు 7 త్రిశూల్ న్యూస్: నందిపేట మండల కేంద్రానికి చెందిన అక్తర్ హుస్సేన్ అతని భార్య అంజుమ్ సుల్తానా, రహీమ్ అతని భార్య సమీనా ఇద్దరు రెండు ద్విచక్ర వాహనాలపై నందిపేట్ నుండి ఆర్మూర్ కు రాత్రి 9 గంటల ప్రాంతంలో బయలుదేరారు. విజయనగరం రామాలయం ముంగటికి వెళ్లేసరికి ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీకొనడంతో వాహనాలపై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అక్తర్ ముప్కల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వీరి నలుగురిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే ఇది ఇలా ఉండగా ప్రమాదం కు కారణమైన కారు అతివేగంగా నందిపేట్ వైపు రావడంతో వివేకానంద చౌరస్తాలో ఉన్న కొందరు యువకులు కారును వెంబడించడం జరిగింది. అయినా కారు దొరకక వెను తిరిగారు. అంతలోపే మండల కేంద్ర సబ్ స్టేషన్ దగ్గరగల గుత్పా కెనాల్ వద్ద టీజీ 16 ఏ 3970 బ్రీజా కారు మంటల్లో తగలబడడం అటుగా వెళుతున్న వారు పోలీసులకు సమాచారం ఇవ్వడం ఫైర్ సిబ్బంది రావడం మంటలను నార్పడం అంతా చకచక జరిగిపోయాయి.. తగలబడ్డ కారు కొండూరు గ్రామానికి చెందిన అవుసలి గంగాధర్ దిగా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.























