ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించిన టీ.జీ.ఎస్.ఆర్టీసీ నిజామాబాద్…
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా టీ.జీ.ఎస్.ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ శ్రీ ఎస్.వి.జి. కృష్ణమూర్తి గారు ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ రీజినల్ మేనేజర్ శ్రీమతి పి. జ్యోతి గారు, పర్సనల్ ఆఫీసర్ శ్రీమతి పద్మజ గారు పాల్గొని ఆచార్య జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి, సమాజాభివృద్ధికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో రీజినల్ కార్యాలయానికి చెందిన అధికారులు, సూపర్వైజర్లు, వివిధ విభాగాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఆచార్య జయశంకర్‌కు ఘన నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

























