Homeతెలంగాణభూభారతి, సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి...

భూభారతి, సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి…

భూభారతి, సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి…

 *ప్రజావాణి అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి* 

*తహసిల్దార్లతో సమీక్షలో కలెక్టర్ భవేష్ మిశ్రా* 

 *ఆలస్యంగా హాజరైన తహసిల్దార్లకు షోకాజ్ నోటీసులు*

నిజామాబాద్, ఆగస్టు 07 : భూభారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమీక్ష మందిరంలో శుక్రవారం ఆయన అన్ని మండలాల తహసిల్దార్లతో భూభారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం, ఇతర రెవెన్యూ అంశాలపై సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు ఎన్ని అని ఆరా తీస్తూ, వాటి పరిష్కారంలో జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన జరుపుతూ ఈ నెలాఖరులోగా అన్నింటిని పరిష్కరించాలని కలెక్టర్ గడువు విధించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. దరఖాస్తుల ధ్రువీకరణ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని, ప్రాధాన్యత క్రమంలో దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణితో పాటు, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సీ.ఎం ప్రజావాణి కార్యక్రమాల ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వెంటదివెంట ఆర్జీలను పరిష్కరిస్తూ, వివరాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. పై అంశాలకు సంబంధించి నిర్ణీత నమూనాలో రోజువారీగా తనకు వివరాలు పంపాలని ఆదేశించారు. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కోసం వచ్చిన దరఖాస్తులను కూడా సత్వరమే పరిశీలిస్తూ పరిష్కరించాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకుని ఈ నెల 17వ తేదీ లోపు అన్ని ఎఫ్.ఆర్.సి దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలని కలెక్టర్ సూచించారు. కస్టం మిల్లింగ్ కోసం లేవీ ధాన్యం కేటాయించిన రైస్ మిల్లులను ప్రతి పక్షం రోజులకు ఒకసారి అయిన తప్పనిసరిగా సందర్శిస్తూ, ధాన్యం నిల్వలను పరిశీలించాలని తహసిల్దార్లను ఆదేశించారు. నూతన తహసిల్దార్ కార్యాలయాల నిర్మాణాల కోసం ఆయా మండలాలలో అవసరమైన స్థలాలను గుర్తిస్తూ, సమగ్ర వివరాలతో నివేదికలు పంపాలని సూచించారు.

*ఆలస్యంగా హాజరైన తహసిల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ*

ఇదిలాఉండగా, సమీక్షా సమావేశానికి ఆలస్యంగా హాజరైన తహసిల్దార్లకు కలెక్టర్ భవేష్ మిశ్రా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిర్ణీత సమయానికి కలెక్టర్ సమావేశ మందిరానికి చేరుకోగా, పలు మండలాల తహసిల్దార్లు గైర్హాజరు కావడాన్ని గమనించి వారి తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత సమయం అనంతరం మరో 15 నిమిషాల వరకు కూడా సమావేశం హాల్ కు చేరుకోలేకపోయిన తహసిల్దర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రతి ఒక్కరు విధిగా సమయ పాలన పాటించాలని కలెక్టర్ సూచించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జిల్లా రెవెన్యూ అధికారి గీత, నిజామాబాద్, బోధన్ ఆర్డీఓలు రాజేంద్రకుమార్, విజయకుమారి, ఆయా మండలాల తహసిల్దార్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!