భీమ్గల్ పట్టణంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఈరోజు భీంగల్ పట్టణంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు అనంతరావు మాట్లాడుతూ… రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవానికి, యువతకు, పంచాయతీరాజ్ వ్యవస్థకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశంలో సద్భావన, ఐక్యతను పెంపొందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

























