నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 31ఆగస్టు 2026…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీమ్‌గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నూతన పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 31 ఆగస్టు 2026 వరకు మాత్రమే కలదని మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ తెలిపారు. నూతన పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, పైలేరియా బాధితులు నూతన పెన్షన్ కోసం దరఖాస్తు 31 ఆగస్టు 2026 వరకు చేసుకోవచ్చని తెలిపారు.
అర్హత కలిగిన వారు అవసరమైన పత్రాలతో మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌ను సంప్రదించి తమ దరఖాస్తులను సమర్పించాలని కమిషనర్ సూచించారు.






















