Homeకామారెడ్డి జిల్లాసైన్స్ బోధనలో వినూత్నత.. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా బాణాల స్వప్న!

సైన్స్ బోధనలో వినూత్నత.. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా బాణాల స్వప్న!

కామారెడ్డి జిల్లాకు చెందిన విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయురాలు బానాల స్వప్న తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. కామారెడ్డి చిన్నమల్లారెడ్డి బాలికల పాఠశాల ఉపాధ్యాయురాలు బానాల స్వప్న విజ్ఞానశాస్త్ర బోధనలో విశేష ప్రతిభ చూపి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. సదాశివ నగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన బాణాల స్వప్నా రెడ్డి ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాలకే పరిమితమైన చదువు కంటే ప్రయోగాలతో సాగే అభ్యసనం విద్యార్థుల మెదళ్లకు ఎంతటి పదును పెడుతుందో ప్రత్యక్షంగా నిరూపించారామె. గ్రామీణ విద్యార్థినుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని నాటి, వారి ఆలోచనలకు రెక్కలు తొడిగి జాతీయ వేదికలపై సగర్వంగా నిలిపిన ఆ గురుమాత విద్యా ప్రస్థానం ఎలా సాగింది? మారుమూల తరగతి గది నుంచి రాష్ట్ర స్థాయి గుర్తింపు వరకు రావడం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది. మొదట రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌లో ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన స్వప్న, ఇప్పటివరకు ఐదు పాఠశాలల్లో సేవలందించారు. సైన్స్ పాఠాలను విద్యార్థుల మనసుల్లో నాటుకుపోయేలా అరటిపండు ఒలిచిపెట్టిన చందంగా ప్రయోగాల రూపంలో బోధించడం ఆమె శైలి. ఈ ఏడాది నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్’‌లో తమ పాఠశాల విద్యార్థినులను తీర్చిదిద్ది పాల్గొనేలా చేయడంలో కీలకపాత్ర పోషించారు. విద్యా రంగానికి ఆమె చేసిన విశిష్ట సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పురస్కారానికి ఎంపిక చేసింది. కొడంగల్ లో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు. జిల్లా కీర్తిని దశదిశలా చాటిన స్వప్నను పలువురు విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జంగంపల్లిలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు..

0
జంగంపల్లిలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... శ్రీ మురళీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు.. భారీగా తరలివచ్చిన భక్తులు జంగంపల్లి: కామారెడ్డి జిల్లా జంగంపల్లిలోని శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మజ్ఞానాశ్రమం ఆధ్వర్యంలోని...

రైతులకు ఉచితంగా మీరా మందు పంపిణీ…

0
రైతులకు ఉచితంగా మీరా మందు పంపిణీ... రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగకరమైన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్...

ధర్పల్లిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు…

0
ధర్పల్లిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులను శ్రీకృష్ణుడి వేషధారణలో...

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ…

0
కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... జిల్లా కేంద్రంలో బహుముఖ ప్రజ్ఞాశాలి, హైదరాబాద్ మాజీ మేయర్,ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి...

హామీలు ఇచ్చి మోసం చేశారు.. గ్రామాల్లో కాంగ్రెస్‌ను నిలదీయండి: వేముల…

0
“హామీలు ఇచ్చి మోసం చేశారు.. గ్రామాల్లో కాంగ్రెస్‌ను నిలదీయండి: వేముల” *ఆరు గ్యారంటీల పేరుతో మహిళలకు అనేక హామీలు ఇచ్చి మహిళలను నిండా ముంచిన రేవంత్ సర్కార్* *కాంగ్రెస్ ఇచ్చిన ‘గ్యారెంటీ కార్డు మోసపూరితం* *మోర్తాడ్ వేదికగా...

Translate »
error: Content is protected !!