ధర్పల్లిలో 3.5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి: మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
శుక్రవారం ఎస్సై జి. సందీప్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనంలో నాలుగు సంచుల్లో సుమారు 3.5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.
పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు షేక్ అల్తాఫ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి. సందీప్ తెలిపారు.
ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

























