ధర్పల్లిలో బీఆర్ఎస్ కదం.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వంటావార్పు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లాధర్పల్లి: మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు జరిగితే ప్రజలు కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటారని వారు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, మండల అధ్యక్షుడు మైపాల్ యాదవ్, మాజీ ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల బీఆర్ఎస్ సర్పంచులు, ఉపసర్పంచులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

























