ధర్పల్లిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులను శ్రీకృష్ణుడి వేషధారణలో అలంకరించి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఉట్టి కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.
విలేజ్ కమిటీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో బంగారు గంగాకుమార్. సాయికృష్ణ. శోభన్. గ్రామ పెద్దలు విడీసి సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

























