జంగంపల్లిలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు..
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం...
శ్రీ మురళీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు.. భారీగా తరలివచ్చిన భక్తులు
జంగంపల్లి: కామారెడ్డి జిల్లా జంగంపల్లిలోని శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మజ్ఞానాశ్రమం ఆధ్వర్యంలోని శ్రీ మురళీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

వేడుకల్లో భాగంగా ధ్వజపూజ, ధ్వజారోహణం, గణపతి పూజ, స్వామివారికి మహాభిషేకం, లక్ష పుష్పార్చన, ఛప్పన్ భోగ్ సమర్పణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రసాద వితరణ చేశారు.

శ్రీకృష్ణుని దర్శనం కోసం కామారెడ్డి జిల్లాలోని వివిధ గ్రామాలతో పాటు పట్టణాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
వేడుకల నిర్వహణకు పలువురు భక్తులు, దాతలు తమవంతు సహాయ సహకారాలు అందించారు. ఆలయ అర్చకులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ఎంతో పవిత్రమైన శ్రీ మురళీకృష్ణ మందిరానికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

























