Homeతెలంగాణనేర రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరం...

నేర రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరం…

నేర రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

2017 నుంచి 2026 సెప్టెంబర్ వరకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా 10,991 సీసీ కెమెరాల ఏర్పాటు

సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో మరింత అవగాహన రావాలి: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిని నేర రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు పోలీసులతో పాటు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ సూచించారు. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా 2017 నుంచి 2026 సెప్టెంబర్ వరకు మొత్తం 10,991 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గతంలో దొంగతనాలు, దాడులు, మోసాలు వంటి ఘటనలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడం, దొంగిలించిన ఆస్తులను రికవరీ చేయడం పోలీసులకు సవాలుగా ఉండేదన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ నగరంతో పాటు పట్టణాలు, గ్రామాల్లో జనాభా, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, అపార్ట్‌మెంట్లు, సినిమా థియేటర్లు, బంగారు దుకాణాలు తదితర ప్రాంతాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు.

అభివృద్ధితో పాటు ప్రజల భద్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంటి వద్ద, వీధుల్లో, వ్యాపార సంస్థల్లో, అవసరమైన ప్రాంతాల్లో నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నేరం జరిగిన తర్వాత బాధపడటం కంటే, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలన్నారు.

సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను త్వరగా గుర్తించడంతో పాటు దొంగిలించిన వస్తువులను తక్కువ సమయంలోనే రికవరీ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. నేరాలకు పాల్పడే వారిలో కూడా భయం కలిగించి నేరాలను నియంత్రించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. న్యాయస్థానాల్లో కూడా సీసీ కెమెరాల ఫుటేజీ కీలకమైన ఆధారంగా ఉపయోగపడుతుందని తెలిపారు.

వ్యాపార సంస్థలు, బంగారు దుకాణాలు, వస్త్ర దుకాణాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు, ఏటీఎంలు, ఆసుపత్రులు, అపార్ట్‌మెంట్లు, సినిమా థియేటర్లు, ప్రార్థనా మందిరాలు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

స్కూల్స్, కాలేజీల వద్ద ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ వంటి ఘటనలను అరికట్టడంలో కూడా సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని అన్నారు. మహిళలపై దాడులు, వాహనాల చోరీలు, ఆస్తుల ధ్వంసం, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తదితర ఘటనలను గుర్తించడంలో కెమెరాల ఫుటేజీ ఎంతో కీలకంగా ఉంటుందని తెలిపారు.

ర్యాలీలు, బహిరంగ కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే అవాంఛనీయ ఘటనలకు పాల్పడే వారిని త్వరగా గుర్తించవచ్చన్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద కూడా లోపల, బయట నాణ్యమైన కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఖాతాదారులు, ఉద్యోగుల భద్రతను పెంచవచ్చని చెప్పారు.

దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు వంటి ప్రార్థనా మందిరాల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమన్నారు. సినిమా థియేటర్లలో ఎంట్రన్స్, బాల్కనీ, పార్కింగ్ ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

“ప్రజలే యూనిఫాం లేని పోలీసులు” అని పేర్కొన్న పోలీస్ కమిషనర్, ప్రతి ఒక్కరూ తమ పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలని కోరారు.

మన ఇల్లు, మన వీధి, మన గ్రామం, మన పట్టణం సురక్షితంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సమాజం పట్ల బాధ్యతగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

చంద్రాయన్‌పల్లి వద్ద లారీ బోల్తా…

0
చంద్రాయన్‌పల్లి వద్ద లారీ బోల్తా.. ప్రమాదాలకు అడ్డాగా ఎన్‌హెచ్‌–44! బ్రిడ్జి పనుల్లో జాప్యం.. హెచ్చరిక బోర్డులు, లైటింగ్ లేక ప్రయాణికుల ఇబ్బందులు... ఇందల్వాయి మండల్  త్రిశూల్ న్యూస్  రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల పరిధిలోని...

జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు…

0
జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు అండర్‌–13 విభాగంలో ముగ్గురికి చోటు.. విద్యార్థులను అభినందించిన విద్యాశాఖ అధికారులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తోర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన...

తెలంగాణ యూనివర్సిటీకి కేవలం రెండు పోస్టుల కేటాయింపు అన్యాయం: పీడీఎస్‌యూ…

0
తెలంగాణ యూనివర్సిటీకి కేవలం రెండు పోస్టుల కేటాయింపు అన్యాయం: పీడీఎస్‌యూ ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులన్నీ భర్తీ చేయాలి.. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం కేవలం...

ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్   నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ...

ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను నిజామాబాద్...

Translate »
error: Content is protected !!