నందిపేట్ విద్యార్థుల క్రికెట్ ప్రతిభ…
నందిపేట్ మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు అండర్–14 క్రికెట్ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి సత్తా చాటారు.
రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు.. గోవాలో జరిగిన ఆల్ ఇండియా మల్టీ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్–2026లో పాల్గొని విజయాన్ని సాధించారు.
ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులను నందిపేట్ సర్పంచ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం కార్యదర్శి, నందిపేట్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎర్రం లింగం పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు.
విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నందిపేట్‌కు మంచి పేరు తీసుకురావాలని ఎర్రం లింగం ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రామ గౌడ్, ప్రిన్సిపల్ శ్రీనివాస్, పీఈటీ సంతోష్‌తో పాటు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులను అభినందించారు.

























